నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్న ప్రభుదేవా

Prabhu-Deva12
ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. ఒక్క కొరియోగ్రాఫర్ గానే గానే కాకుండా ఆ తర్వాత హీరోగా పరిచయం అయ్యి కొన్ని హిట్ సినిమాల్లో నటించాడు. హీరో నుంచి డైరెక్టర్ గా మారిన ప్రభుదేవా ప్రస్తుతం హిందీలో స్టార్ డైరెక్టర్ గా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ గా బిజీగా ఉన్నా అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూనే ఉన్నాడు.

రియల్ లైఫ్ లో లానే స్క్రీన్ మీద కూడా ఓ కొరియోగ్రాఫర్ గా కనిపించిన సినిమా ‘ఎబిసిడి’. డాన్స్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా సీక్వెల్ ‘ఎబిసిడి 2’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. వరుణ్ ధావన్, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవా ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది.

Exit mobile version