మీడియా తో గొడవ పెట్టుకున్న అల్లు శిరీష్

Allu-Sirish
సౌత్ స్కోప్ మ్యాగజిన్ హెడ్ గా మరియు గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా పరిచయం వున్నఅల్లు శిరీష్ ‘గౌరవం’ చిత్రం ద్వారా హీరో గా పరిచయం అయ్యాడు. రాధా మోహన్ లాంటి టాలెంటెడ్ దర్శకుడు వున్నా ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడింది. రెండో చిత్రం ‘కొత్త జంట’ యవరేజ్ గా నిలిచింది. అయితే ఆ చిత్రం శిరీష్ కి నటుడిగా మంచి మార్కులు సంపాదించింది. అయితే తనని వూరిస్తున్న విజయం సాధించడం కోసం ఇటివలే శ్రీకాళహస్తి అదృష్టం కోసం పూజలు నిర్వహించారు. కొంత మంది మీడియా ప్రతినిధులు తన ఫోటో తీయడానికి ప్రయత్నించగా వారితో దురుసుగా వ్యవహరించారు. వెంటనే తన తప్పు తెలుసుని క్షమాపణ తెలిపారు.

ప్రస్తుతం తన మూడో చిత్రం కోసం కధలు వింటున్న శిరీష్ ఇంకా దేనిని ఖరారు చేయలేదు. తన మూడో చిత్రాన్ని శిరీష్ స్వయంగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారని సమాచారం.

Exit mobile version