
సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘కేరింత’. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ‘దృశ్యం’ ఫేం కృతిక జయకుమార్ హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ గా ‘ఐస్ క్రీమ్’ గర్ల్, తెలుగమ్మాయి తేజస్విని ఎంపిక చేశారు. ఇటీవలే ఈ సినిమాకు తేజస్వి సంతకం చేసింది. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తేజస్వి కొన్ని రోజులు చిత్రీకరణలో పాల్గొంది.
తనకు ‘కేరింత’ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. మరో రెండు తెలుగు సినిమాలు ‘పండగ చేస్కో’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’లలో మంచి పాత్రలలో నటించానని తెలిపింది. అవి తప్పకుండా విజయం సాధిస్తాయి అనే నమ్మకం ఉందని చెప్పింది. వాటి చిత్రీకరణ పూర్తయిందని తెలిపింది.