
అక్కినేని నట వారసుడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని’మనం’ సినిమాలో కనిపిచింది ఒకే ఒక్క నిమిషం అయినప్పటికీ ఆ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచి అందరి చూపును ఆకర్షించాడు. ఇంకా తన మొదటి సినిమా సెట్స్ పైకి వెళ్ళక ముందే అఖిల్ సూపర్ స్టార్ అయిపోయాడు. సినిమాలను పక్కన పెడితే అఖిల్ వరుసగా కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేస్తున్నాడు. ఇప్పటికే చేసిన టైటన్ యాడ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా అఖిల్ మరో బ్రాండ్ కి ప్రచార కర్తగా సైన్ చేసాడని సమాచారం.. అదే మౌంటైన్ డ్యూ కూల్ డ్రింక్. అలాగే ఇప్పటికే ఈ మౌంటైన్ డ్యూ కి సంబందించిన యాడ్ షూట్ ని కూడా ఫినిష్ చేసారు. మామూలుగా మౌంటైన్ డ్యూ యాడ్ అంటేనే రిస్కీ స్టంట్స్ చెయ్యాలి. దేన్నీ బట్టి అఖిల్ కూడా రిస్కీ స్టంట్స్ చేసి ఉంటాడని సమాచారం. త్వరలోనే దీనిని రిలీజ్ చేయనున్నారు. ఇది కాకుండా అఖిల్ మొదటి సినిమా కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమా నవంబర్ మధ్యలో లాంచనంగా ప్రారంభం కానుంది.