
రానా దగ్గుబాటి.. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఆప్త మిత్రుడు, అజాత శ్రుతువు కూడా. ఇటీవల ఏమాత్రం కొంచం ఖాళి సమయం దొరికినా నటుడు సూర్య చెంత చేరిపోతున్నాడు. వీరిద్దరూ కలసి దిగిన సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ‘బాహుబలి’ బ్రదర్ ప్రభాస్ తో కలసి రానా, సూర్య దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రభాస్ ను కూడా అందరూ డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుస్తారు. వీరు ముగ్గురూ కలసి ఓ సాయంత్రం సరదాగా గడిపారు. దర్శకుడు వెంకట్ ప్రభును కూడా ఫోటోలో చూడొచ్చు. ముగ్గురు హీరోలు ఉన్న ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.