
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. స్టైలిష్ నీరజ కోన మరియు కొందరు అభిమానులతో కలసి హైదరాబాద్ లోని ఒక ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాలను, రహదారులను శుభ్రం చేశారు. క్లీన్ ఇండియా కాంపెయిన్ లో తన భాద్యతను నిర్వర్తించారు. యువ హీరో రామ్ సమంతను స్వచ్ఛ భారత్ కాంపెయిన్ లో పోల్గోనవలసిందిగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ముందడుగు వేస్తున్నారు.