
‘రన్ రాజా రన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ గత కొద్ది రోజులుగా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో శర్వానంద్ కి జోడీగా నిత్యా మీనన్ నటించింది. ఈ సినిమా టాకీ పార్ట్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. ఈ సినిమాలో బాలన్స్ ఉన్న పాటలను కూడా నిన్నటితో పూర్తి చేసారు. దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.
టాకీ పార్ట్ పూర్తి కాగానే శర్వానంద్ తన పార్ట్ కి డబ్బింగ్ ని కూడా పూర్తి చేసాడు. ప్రస్తుతం ఈ సినిమాకి మిగిలి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ చివర్లో ఆడియోని రిలీజ్ చేసి, డిసెంబర్లో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘ఓనమాలు’ ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎ వల్లభ నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.