
ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గోపాల గోపాల లో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్న సంగతి మనకు తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనుండడంతో షూటింగ్ ని శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం వైజాగ్ షెడ్యూల్ కోసం రంగం సిద్దం చేసుకుంటోంది.
వచ్చే వారం నుంచి వెంకటేష్ పై ఓ పాటని షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ కోసం వైజాగ్ లో ఓ స్పెషల్ సెట్ ని వేసారు. సెట్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. వెంకటేష్ పై వచ్చే పాటని పూర్తి చేస్తే ఆ తర్వాత కొంత టాకీ పార్ట్ మరియు పవన్ కళ్యాణ్ పై వచ్చే సాంగ్ మాత్రమే బాలన్స్ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ లో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ చాన్స్ ఉండడంతో ఈ చిత్ర టీం స్పెషల్కేర్ తీసుకుంటున్నారు. వెంకటేష్ – శ్రియ శరన్ జంటగా కనిపించనున్న ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.