‘గబ్బర్ సింగ్ 2’లో సెకండ్ హీరోయిన్..?

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకేక్కబోయే ‘గబ్బర్ సింగ్ 2’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా ‘అలియాస్ జానకి’ ఫేం అనీష అంబ్రోస్ ను ఎంపిక చేశారు. ‘పవర్’ ఫేం బాబీ ‘గబ్బర్ సింగ్ 2’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా మూవీ యూనిట్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘గబ్బర్ సింగ్ 2’లో మరొక హీరోయిన్ కు అవకాశం ఉంది. సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా గ్లామరస్ గా ఉంటుందని టాక్. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుంది. హీరోయిన్ ఎంపిక పూర్తవగానే అధికారికంగా ప్రకటిస్తారట. దర్శకనిర్మాతల నుండి ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటన లేదు.

‘గబ్బర్ సింగ్’కు… ఈ సీక్వెల్ కు కథలో ఎటువంటి సంబంధం లేదు. కేవలం హీరో క్యారేక్టరైజేషన్ మాత్రమే ఫాలో అవుతున్నారు. శరత్ మరార్ ఈ చిత్రానికి నిర్మాత.

Exit mobile version