బ్రేక్ లేకుండా ‘కిక్ 2’

Raviteja
మాస్ మహారాజ్ రవితేజ, సురేందర్ రెడ్డి కలయికలో తెరకెక్కుతున్న ‘కిక్ 2’ చిత్రీకరణ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. అక్టోబర్ ద్వితీయార్ధంలో మొదలైన రెగ్యులర్ షూటింగ్ నిరాటంకంగా కొనసాగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటి నుండి బ్రేక్ తీసుకోలేదు. రవితేజ, హిందీ హాస్య నటుడు రాజ్ పాల్ యాదవ్ తదితరులపై పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. హైదరాబాద్ నగర శివార్లలో ‘కిక్ 2’ కోసం ప్రత్యేకంగా 2 కోట్ల రూపాయల సెట్ ను నిర్మించినట్టు సమాచారం.

‘కిక్’ సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కధానాయిక. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కిక్’ చిత్రానికి కథ అందించిన వక్కంతం వంశి సీక్వెల్ కి సైతం కథను అందించారు. మాస్ మహారాజ్ అభిమానులకు డబల్ కిక్ ఇవ్వడానికి చిత్ర బృందమంతా కృషి చేస్తున్నారు.

Exit mobile version