ఈరోజు ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

rajinikanth_Amitha-bachchan
45వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈరోజు గోవాలో ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్ కాస్టింగ్ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ అరుణ్ జట్లే గారి చేతులమీదుగా ప్రారంభమయ్యింది. ఈ వేడుకకి అమితాబ్ బచ్చన్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. 12మంది సినిమా ప్రముఖల 26 సినిమాలను ప్రదర్శించారు. ప్రముఖదర్శకుడు గుణ్ణం గంగరాజు కూడా జ్యూరీ విభాగంలో వున్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీకి గానూ సెంటినరీ అవార్డు ఇవ్వనున్నారు. రజినీ ఇప్పటికే గోవాకి చేరుకున్నారు. 1952లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. ఆసియాలో అతిపెద్ద చలనచిత్ర వేడుకలలో ఇది ఒకటి

Exit mobile version