
‘నా బంగారు తల్లి’ స్పెషల్ షో చూసిన తర్వాత మన సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయా..? అంటూ ఆశ్చర్యపోవడం రెజినా వంతు అయ్యింది. తర్వాత ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అందరూ ఈ చిత్రం చూడండి అని చెప్పింది.
మనసుకు హత్తుకునే చిత్రం ‘నా బంగారు తల్లి’. ఈ చిత్రం గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా మలిచారు. ఇటువంటి ఘటనలు మన సమాజంలో జరుగుతున్నాయి అని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. మనం సిగ్గుపడాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరిలో ఈ చిత్రం సమాజంలో మన చుట్టూ ఏమి జరుగుతుందో అవగాహన కలిగిస్తుంది. అందరూ ఈ చిత్రాన్ని చూడండి. అని రెజీనా చెప్పారు.
సిద్దిక్, అంజలి పాటిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 21న, ఈ శుక్రవారం ‘నా బంగారు తల్లి’ విడుదలవుతుంది.