
రామ్ గోపాల్ వర్మ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది.. ఓ సెన్సేషన్.. ఓ వివాదం.. తను చేసే సినిమాల హిట్స్ లేదా ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న వర్మ తన సినిమాలను 20 – 30 రోజుల్లో ఫినిష్ చేసేస్తున్నాడు. ఇప్పటికే తను చేస్తున్న చాలా సినిమాల షూటింగ్ పూర్తయిపోతే, కొన్ని సెట్స్ పై ఉన్నాయి. ఇప్పుడు వర్మ తన మరో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసాడు. ఆ సినిమా పేరు ‘స్పాట్’.
వర్మ ఈ సినిమాకి సంబందించిన ఆడియో పోస్టర్ ని రిలీజ్ చేసాడు. అందులో ఈ సినిమాని ఏ కథతో తీస్తున్నాడో తెలియజేశాడు. వర్మ మాట్లాడుతూ ‘మామూలుగా ఎవరినన్నా చంపాలి అనుకుంటే వారికి స్పాట్ పెట్టాలంటారు. రాయలసీమ ఫ్యాక్షనిస్టుల నుంచి ఈ పదం బాగా ఫేమస్ అయ్యింది. స్పాట్ అనేది అందరూ ఈజీగా అనేస్తారు కానీ ఒక స్పాట్ పెట్టాలి అంటే దాని వెనుక ఎంత శ్రమ ఉంటుందనేది తెలుసుకున్న నేను షాక్ అయ్యాను. అందుకే రక్త చరిత్ర 1 లో పదే నిమిషాలు ఉన్న ఓబుల్ రెడ్డి హత్యని ఇప్పుడు పూర్తి సినిమాగా తీయడానికి నిర్ణయించుకున్నాను. ఓబుల్ రెడ్డికి స్పాట్ పెట్టడానికి గల కారణం, అసలు వ్యక్తుల్ని, ఆ స్పాట్ వల్ల వచ్చిన పరిస్థితులను తెలుసుకున్నప్పుడు నాకు రోమాలు నిక్క బొడుచుకున్నాయి. అందుకే ఈ సినిమాకి స్పాట్ అనే టైటిల్ పెట్టి ఓబుల్ రెడ్డి స్పాట్ ని సినిమాగా తీస్తున్నానని’ అన్నాడు.
రామ్ గోపాల వర్మ స్పాట్ ఆడియో టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి – స్పాట్ ఆడియో టీజర్