
విశాల్, హన్సిక జంటగా నటిస్తున్న తమిళ సినిమా ‘అంబాల’. నటి ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో పాలబుగ్గల సుందరి హన్సిక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఖాకి డ్రెస్సులో ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుండి మంచి స్పందన లభించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోతో ప్రేమ పాఠాలు చెప్తుందో..? లేక రౌడీల తాట తీస్తుందో..? వేచి చూడాలి.
ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు మధురిమ, మాధవి లత కూడా నటిస్తున్నారు. ముగ్గురు సీనియర్ హీరోయిన్లు రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ లు విశాల్ కి అత్తలుగా కనిపిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.