
విశాఖ హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం ఆదివారం నాడు తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమం ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తమవంతు భాధ్యతగా టాలీవుడ్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని, ప్రముఖుల కృషిని కొనియాడారు. సినీ ప్రముఖుల కృషికి తోడు సామాన్య ప్రజలు కూడా స్పందించిన తీరు అమోఘమని చంద్రబాబు అన్నారు.
‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా సేకరించిన 11,51,56,116/- విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్ రూపంలో అందజేశారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ‘మేము సైతం’ వినోద కార్యక్రమాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి.