100కె.జీల వరకూ పెరగనున్న అనుష్క ?

anushka
తన కొత్త సినిమాకోసం అందాల నటి అనుష్క 100 కే.జీల వరకూ బరువు పెరగనుందా? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు

అనుష్క త్వరలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పి.వి.పి బ్యానర్ లో ఒక సినిమాను అంగీకరించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో వుంది. అనుష్క ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనుంది. అందులో ఒక పాత్రకోసం లావు పెరుగుతుంది. దానికోసం 100 కిలోల వరకూ పెరుగుతుందని సమాచారం

ఈవార్తే గనుక నిజమైతే ఇది సాహస ప్రక్రియనే చెప్పాలి. ఒక్కసారి లావయ్యాక తిరిగి సన్నబడడం అంత తేలికైన విషయం కాదు. మరి అనుష్క ఈ సవాలుని ఎలా స్వీకరిస్తుందో చూడాలి

Exit mobile version