రామ్ చరణ్ హీరోయిన్ కు తమిళంలో వరుస ఆఫర్స్

Amy-Jackson
రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ సినిమాలో నటించిన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ కు తమిళంలో వరుస అవకాశాలు లభిస్తున్నాయి. రజినీకాంత్ అల్లుడు ధనుష్, కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలకు మంచి క్రేజ్ నెలకొంది. ధనుష్ సినిమా హిట్ కాంబినేషన్లో తెరకేక్కుతుంది. మరోసారి ‘విఐపి’ దర్శకుడు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా కోసం జత కట్టారు. ఉదయనిధి సినిమా కూడా క్రేజీ కాంబినేషనే.

విక్రమ్ – శంకర్ కాంబినేషన్ లో రూపొందిన ‘ఐ’ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్. ఈ సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్తుందని తమిళ దర్శకనిర్మాతలు, హీరోలు భావిస్తున్నారు. అందాల ప్రదర్శనలో మిగతా హీరోయిన్ల కంటే ఈ బికినీ భామ ఒక అడుగు ముందు ఉండడం కూడా వరుస అవకాశాలు సొంతం చేసుకోవడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version