
‘ముల్లయ్ వానమ్ 999′ అనే టైటిల్ తో తాను రచించిన కథను కాపీ కొట్టారంటూ ‘లింగ’ టీంపై కెఆర్ రవిరత్నం అనే రచయిత ఆరోపణలు చేసిన సంగతి విధితమే. అంతే కాదు, ‘లింగ’ యూనిట్ పై మద్రాస్ హైకోర్ట్ లో ఒక కేసు దాఖలు చేశారు. వీటిని ‘లింగ’ యూనిట్ అవాస్తవమని పేర్కొన్నారు. 2010లోనే పొన్ను కుమారన్ ‘లింగ’ కథను రాశారని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. ‘లింగ’ టీంకు అనుకూలంగా తీర్పును వెల్లడించారు. దాంతో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.
కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ‘లింగ’ సినిమాలో సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో సందడి చేయనున్నారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. రజినీకాంత్ పుట్టినరోజున, డిసెంబర్ 12న సినిమా విడుదలవుతుంది. అభిమానులలో భారి అంచనాలు నెలకొన్న ఈ ప్రతిష్టాత్మక సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు.