ఇంస్తాగ్రాంలో బాహుబలి విశేషాలు తెలుపుతానంటున్న తమన్నా

Tamanna
బాహుబలి సినిమాని తరచూ వార్తలలో నిలపడానికి ఆ చిత్ర బృందం చేతికందిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడంలేదు. షూటింగ్ జరుపుతూ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఈ చిత్రం పై క్రేజ్ తగ్గకపోవడం విశేషం. ఈ సినిమా ప్రచారం కోసం సోషల్ మీడియాని వాడుకోవడం విశేషం. ట్విట్టర్, ఫేస్ బుక్ లనే కాక ఇప్పుడు ఇంస్తాగ్రామ్ ని కూడా వాడుకుంటుంది. తమన్నా తన పెర్సనల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బాహుబలి మేకింగ్ ఫోటోలు షేర్ చేస్తానని చెప్పడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు

ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రధారులు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదలచేయనున్నారు. మొదటి భాగం 2015 ఏప్రిల్ 27న విడుదలకానుంది

Exit mobile version