ఎన్టీఆర్ డాన్స్ కి ఫిదా అయిన ఐటెం గర్ల్..

NTR_Nora-Fatehi
టాలీవుడ్ బెస్ట్ డాన్సర్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. అతనితో కలసి డాన్స్ చేయడానికి హీరోయిన్లు కొంచం భయపడతారు. క్లిష్టతరమైన స్టెప్పులను అవలీలగా చేసే ఎన్టీఆర్ ను చూసి అతనికి అభిమానులుగా మారుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ఫారిన్ బ్యూటీ నోరా ఫతేహి కూడా చేరింది.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమాలో నోరా ఫతేహి ఐటెం సాంగులో నటించింది. ఎన్టీఆర్ లా ఎవ్వరూ క్రేజీగా డాన్స్ చేయలేరు. ఎన్టీఆర్ డాన్స్ లో ఎనర్జీ ఉంటుంది. అంటూ యంగ్ టైగర్ పై పొగడ్తల వర్షం కురిపించింది. ఐటెం సాంగులో నోరా ఫతేహి బెల్లి డాన్స్ చేసిందట.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారు.

Exit mobile version