నెంబర్ 1 స్థానం దిశగా పీకే

pk
ఆమీర్ ఖాన్ నటించిన పీ.కే చిత్రానికి తొలుత మిశ్రమ స్పందన లభించినా రోజురోజుకూ వినిపిస్తున్న మౌత్ టాక్ పుణ్యమా అని ఈ సినిమా తొలి వారం రికార్డు కలెక్షన్లను సంపాదించుకుంది. గతంలో ధూమ్ 3 పేరిట వున్న రికార్డుని ఈ చిత్రం తుడిచిపెట్టింది. ఆమీర్ పీకే సినిమా మొదటివారం ఏకంగా 183 కోట్లను సంపాదించింది. ఆమీర్ గత చిత్రం ధూమ్ 3 తో పోల్చుకుంటే ఈ కలెక్షన్ ఒక 5 కోట్లు ఎక్కువే. ఈ సినిమాకు ఎలాగో మంచి రిపీట్ వేల్యూ వున్న నేపధ్యంలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి

హైదరాబాద్ వంటి నగరాలలో ఒక హిందీ చిత్రమయ్యుండి మల్టీప్లెక్స్ లలో హౌస్ ఫుల్ బోర్డులను అందుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కించిన ఈ సినిమాకు విదు వినోద్ చోప్రా నిర్మాత

Exit mobile version