
వీర శంకర్ దర్శకత్వంలో అరవింద్ కృష్ణ – రచన మల్హోత్రా జంటగా నటించిన సినిమా ‘మన కుర్రాళ్ళే’. చాలా కలం క్రితమే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ పలుసార్లు వాయిదాపడింది. ఎట్టకేలకు ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని 2015 న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అయిన రంగ్ దే బసంతి సినిమాలో చెప్పిన కొన్ని పాయింట్స్ మనకు కనిపిస్తాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరశంకర్ మాట్లాడుతూ ‘మన కుర్రాళ్ళే సినిమాలో లవ్, హ్యాపీనెస్, పలు సమస్యలు మరియు వయొలెన్స్ లాంటి ఎన్నో ఎమోషన్స్ ని మేళవించాము. 2007 – 2014 మధ్య ఈ సినిమా జరుగుతుందని’ తెలిపాడు. ఇప్పటి వరకూ ఒక దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు. అది కూడా రియల్ లైఫ్ పాత్రలో కనిపిస్తాడు. బివిఎస్ శ్రీనివాస్ – హెచ్ఎస్ హరూన్ కలిసి ఈ సినిమాని నిర్మించారు.