‘ఆవకాయ్ బిర్యాని’ తో సక్సెస్ అందుకున్న హీరో కమల్ కామరాజుకి ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాక్స్ ఆఫీసు వద్ద మెప్పించదగిన సినిమాలు ఏమీ రాలేదు. తను గోదావరి, ఛత్రపతి లాంటి సినిమాల్లో చేసిన పాత్రలు అతని మంచి పేరు తెచ్చి పెట్టాయి. యాక్టర్ గా ఎంతో టాలెంట్ ఉన్న ఈ కుర్రాడికి నటనతో పాటు కుంచెతో పెయింటింగ్స్ వేయడం కూడా వచ్చు. చెప్పాలంటే తనొక మంచి ఆర్టిస్ట్.
తాజాగా కమల్ కామరాజు తన కుంచెకి కాస్త పని పెట్టి తన చిత్రాలను ఒక ఎగ్జిబిషన్ లో పెట్టాడు. ఈ మూస ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ జనవరి 4న హైదరబాద్ లోని మారియట్ హోటల్ లో జరగనుంది. ఈ ఎగ్జిబిషన్ కి రాణి అనే టైటిల్ ని పట్టారు అలాగే దానికి ఉపశీర్షికగా సెలబ్రేషన్ అఫ్ కలర్స్ అని పెట్టారు. కమల్ కామరాజు ఒక నటుడు, ఆర్టిస్ట్ గానే కాకుండా రైటర్, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్, ఫోటోగ్రాఫర్ మరియు ఆర్కిటెక్ట్ కూడా కావడం విశేషం.
