వినూత్న పబ్లిసిటీని ఫాలో అవుతున్న ‘బాహుబలి’

Baahubali

టాలీవుడ్ సక్సెఫుల్ కమర్షియల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గత రెండేళ్లుగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా మొదలైన నాటి నుంచి ఈ చిత్ర టీం ఎంతో వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తోంది. మొదట్లో ప్రభాస్ బర్త్ డే వీడియో, అనుష్క మరియు రానా బర్త్ డే వీడియోస్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేశాయి. తాజాగా బాహుబలి టీం రిలీజ్ చేసిన ది వరల్డ్ అఫ్ బాహుబలి ఇండియా మొత్తం ట్రెండ్ అవుతోంది.

అంతటితో ఆగకుండా ఈ చిత్ర టీం కంటిన్యూగా ప్రమోట్ చేస్తోంది. ప్రసతుతం మొబైల్ ప్రపంచంలో బాగా ఫేమస్ అయిన వాట్స్ అప్ ద్వారా అభిమానులకు రెగ్యులర్ అప్డేట్స్ అందిస్తున్నారు. దీనికి కావాల్సింది వారిచ్చిన ఫోన్ నెం ని మీరు సేవ్ చేసుకోవడమే.. ఈ ప్రమోషన్ స్ట్రాటజీకి భారీ రెస్పాన్స్ వస్తోంది మరియు ఎంతో మంది రిజిస్టర్ అవుతున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ ఇంకా భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంది.

Exit mobile version