
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా మొదటి పార్ట్ 2015 వేసవికి అన్న మాట తప్పితే మరో న్యూస్ లేదు.. హైదరాబాద్, కేరళ, బల్గేరియా, రామోజీ ఫిల్మ్ సిటి అంటూ షూటింగ్ స్పాట్ పేర్లు మాత్రం వినబడుతున్నా షూటింగ్ అయిన పపెర్సంట్ మాత్రం బయటకు చెప్పడంలేదు. . అయితే ప్రేక్షకుల అనుమానాలకు సమాధానంగా బాహుబలి టీమ్ నుండి ఒక తీయ్యటి కబురు వినపడింది.
“కొన్ని పాచ్ వర్క్స్, కొంత టాకీ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఆదివారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ మొదలైంది. 2015 వేసవికి బాహుబలిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనలు జరుగుతున్నాయి” అంటూ బాహుబలి బృందం పేర్కొంది.