కొత్త దర్శకులకు పూరి జగన్నాద్ బంపర్ ఆఫర్

Puri
క్డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కొత్త టాలెంట్ ఎక్కడున్నా వెలికి తీయడంలో దిట్ట. అయితే ఎన్ని విభాగాలలో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసినా కధ, దర్శకత్వం విభాగం మాత్రం తనని దాటి పంపని పూరి ఈసారి కొత్తదర్శకులకు మాటల రచయితలకు అవకాశాన్ని ఇవ్వనున్నాడు

“పది రోజుల్లో.. నేనొక పది కధలు చెప్తాను.. మీరు ఒక్కో కధకు పదినిముషాలు షార్ట్ ఫిలిం చేసి నాకు పంపండి”. టాలెంట్ మీదగ్గర వుంటే మిమ్మల్ని లైం లైట్ లోకి నేను తీసుకొస్తా అని పూరి చేసిన వ్యాఖ్యలు పలువురిని ఉత్తేజపరిచాయి. “ఒకవేళ మీరు రాకపోతే మేము ఇలాంటి సినిమాలే తీస్తాం. మమ్మల్ని విమర్శించే అధికారంమీకు లేదని” చివర్లో వేసిన పంచ్ డైలాగ్ ఆసక్తికరంగా నిలిచింది. మరి మీ టాలెంట్ ఏంటో చూపించండి..

Exit mobile version