రాజమౌళిపై ప్రశంశలు కురిపించిన శంకర్

shankar-rajamuli

ఒకరేమో సౌత్ సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ శంకర్, మరొకరేమో టాలీవుడ్ స్థాయిని పెంచిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఇలాంటి జీనియస్ లు ఇద్దరూ ఒకే స్టేజ్ పై కలిస్తే ఇక అక్కడ టెక్నాలజీ గురించి, సినిమాల గురించి బోలెడన్ని మాటలు ఎక్సేంజ్ అయిపోతాయి. ఈ ఇద్దరు దర్శక దిగ్గజాలు నిన్న సాయంత్రం జరిగిన ‘ఐ’ ఆడియో లాంచ్ లో పాల్గొన్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

ఈ సినిమా ఆడియో వేడుకలో ఒకరిపై ఒకరు ప్రశంశల జల్లు కురిపించారు. ముందుగా రాజమౌళి మాట్లాడుతూ ‘నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజుల నుంచి ఆయన ఓ సినిమా తీసారు అంటే అసలు ఆ సీన్ ఎలా తీసుంటారు అని చర్చలు చేసేవాళ్ళం. డైరెక్టర్ అయినా ఇప్పటికీ ఆయన సినిమాలు చూసినప్పుడు ఇది ఎలా తీసుంటారా అని ఆలోచిస్తుంటాను. ఎందుకంటే ఎప్పుడు ఆయన మాకంటే చాలా అడ్వాన్స్ గా ఉంటారని’ అన్నాడు.

శంకర్ మాట్లాడుతూ ‘ నేను మగధీర సినిమా చూసి రాజమౌళికి ఫ్యాన్ అయిపోయాను. ఆ తర్వాత ఈగ సినిమా చూసి ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఇప్పుడు ఆయనకీ ఒక వీరాభిమానిలా బాహుబలి కోసం ఎదురు చూస్తున్నానని’ అన్నాడు. ఇలా ఈ క్రియేటివ్ డైరెక్టర్స్ ఒకరిపై ఒకరు ప్రశంశలు కురిపించుకున్నారు.

విక్రమ్ మూడు విభిన్న గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు ఉపేన్ పటేల్ విలన్ గా కనిపించనున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version