‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మరియు విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ దేవకట్ట. అలాంటి దేవకట్ట డైరెక్షన్ లో వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్న మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్న సంగతి మంకు తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చాల రోజుల క్రితమే పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో మంచు విష్ణు పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభమ కానుంది.
ఈ సినిమాలో మంచు విష్ణు టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా పలువురిని అనుకున్నా ఫైనల్ గా ముద్దుగుమ్మ ప్రణితని సేల్కేట్ చేసారు. ఈ సెకండ్ షెడ్యూల్ లో ప్రణిత కూడా జాయిన్ అవ్వనుంది. ఈ సినిమాలో హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
