
నిఖిల్ కెరీర్ లో ఇంకో ఇంటరెస్టింగ్ సినిమాగా నిలవబోతున్న సూర్య వెర్సస్ సూర్య ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ ద్వారా కథ పెద్దగా అర్ధం కాకుండా నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. కాకపోతే ఈ పోస్టర్ ద్వారా నిఖిల్ పాత్రకి రెండు భిన్న కోణాలు వున్నాయని అర్ధం అవుతుంది. సూర్యుడు ఉదయించాకా ఒక సూర్య అస్తమించాక ఒక సూర్య అందుకే ఈ చిత్రం టైటిల్ సూర్య వెర్సస్ సూర్య.
ఈ చిత్రం గురించి చెప్తూ నిఖిల్ “సూర్య అస్తమయం ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి 2014 చివరి సన్ సెట్ కి మించిన మంచి సమయం లేదు’ అని ట్వీట్ చేసాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం లో గత తరం హీరోయిన్ మధు బాల ముఖ్య పాత్ర పోషిస్తుంది.