‘టెంపర్’ ఆడియో విడుదలకు ముహూర్తం కుదిరింది..?

Temper
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘టెంపర్’ ఆడియోను జనవరి 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అభిమానుల సమక్షంలో హైదరాబాద్ నగరంలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారి ఎత్తున నిర్వహించడానికి నిర్మాత సన్నద్ధం అవుతున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ సినిమాకు అనూప్ స్వరాలు సమకూర్చడం ఇదే తొలిసారి.

ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త ఏడాది కానుకగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించారు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఫెబ్రవరి మొదటి వారంలో సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు.

Exit mobile version