‘లయన్’ పంచ్ డైలాగ్ కి అదిరిపోయే రెస్పాన్స్

balakrishna
‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందుకే నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ టైటిల్ ‘లయన్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం లయన్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘లెజెండ్’లో లానే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఓ పాత్ర సిబిఐ ఆ ఫీసర్ గా ఉంటుంది.

ఈ చిత్ర టీం న్యూ ఇయర్ కానుకగా సినిమా టైటిల్ ని ఖరారు చేయడమే కాకుండా ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో బాలకృష్ణని చూపించిన విధానం మరియు తను చెప్పిన పంచ్ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. బాలకృష్ణ ఈ టీజర్ లో ‘కొందరు కొడితే ఎక్స్ రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్లో కనపడుతుంది, అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది’ అని చెప్పిన డైలాగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. ‘లెజెండ్’ తర్వాత వస్తున్న ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకునేలా ఉంటుందని ఈ చిత్ర టీం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.

Exit mobile version