
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ శంకర్, సినిమా కోసం ఏమన్నా చేసే చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ‘ఐ’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతికి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఎన్నో అంచనాలున్న ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయన్ని మీకందిస్తున్నాం..
మాకు అందిన సమాచారం ప్రకారం ‘ఐ’ సినిమా రన్ టైం 3 గంటల 8 నిమిషాలు(188 నిమిషాలు). ప్రస్తుతం ఈ రన్ టైం ఉన్న సినిమాని సెన్సార్ కి పంపుతున్నారు. సెన్సార్ పూర్తైన తర్వాత ఇందులో ఒక 8 నిమిషాలు కట్ చేసి టోటల్ గా 3 గంటల సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెండు గంటల సినిమానే బోర్ కొట్టేలా తీస్తున్న ఈ రోజుల్లో ఇంత లాంగ్ రన్ టైం ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.
విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ‘ఐ’ ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.