లవ్ ఫెయిల్యూర్ : సిద్దార్ధ్, సమంత విడిపోయారు.

sidsamantha,-samatha
ఎన్నడూ బహిరంగంగా ప్రకటించకపోయినా సమంత, సిద్దార్ధ్ ఘాడమైన ప్రేమలో మునిగి తేలారనే విషయం అందరికీ తెలిసిన రహస్యమే. రెండున్నర ఏళ్ళ పాటు సాగిన ఈ ప్రేమాయణానికి ఇక ఎండ్ కార్డు పడినట్లే. ఈ వార్తను సమంత ట్విట్టర్లో అన్యాపదేశంగా అంగీకరించింది. ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డెక్కన్ క్రానికల్ వీరిద్దరూ విడిపోయారని ఒక వార్తను ప్రచురించింది. దీనిపై సమంత ట్విట్టర్లో స్పందించింది.

సమంత, సిద్దార్ధ్ ల లవ్ ఫెయిల్యూర్‌కు గల కారణాలు అంతు చిక్కడం లేదని.. లవ్ బ్రేక్ అప్ అవ్వడంతో సమంత తీవ్రంగా కలత చెందిందని, హర్ట్ అయ్యిందని డిసి పేపర్లో వార్త సారాంశం. సమంత తన కెరీర్ పై ఫోకస్ పెట్టిందని, వీలైనంత త్వరగా బ్రేక్ అప్ నుండి రికవర్ అవ్వడానికి ప్రయత్నిస్తుందని ఆ వార్తలో ప్రచురించారు. లవ్ ఫెయిల్యూర్ వార్తను అంగీకరిస్తూనే.. సిద్దార్ధ్ గొప్ప వ్యక్తి. ఈ విషయం వ్యక్తిగతం అని సమంత కామెంట్స్ చేసింది.

‘డిసిలో ఆర్టికల్ నన్ను భాదితురాలి(విక్టం) చిత్రీకరిస్తుంది, నేను భాదితురాలిని కాదు. సిద్ధు చాలా మంచి వ్యక్తి. మీడియా ఒకరి వైపు నుండి ఈ అంశాన్ని చూడడం ఆపేస్తే మంచిది. ఇది వ్యక్తిగతం. సరే జరిగిందేదో జరిగింది. ఇక ఈ చర్చను ఇక్కడితో ఆపేస్తున్నా. మీరు కూడా ఆపేస్తే మంచిది. అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

Exit mobile version