స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా చివరి దశ షూటింగ్ హైదరబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఫిబ్రవరి 5న ఈ సినిమా రిలీజ్ చెయ్యాలి అనుకోవడంతో జనవరి లోపు మిగిలిన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన వారు డబ్బింగ్ చెప్తున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఈవెంట్ మేనేజర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కోకాపేటలో ఓ స్పెషల్ సెట్ ని వేసారు. ప్రస్తుతం ఆ సెట్లో అల్లు అర్జున్, ప్రముఖ తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో ఫైట్స్ అన్నీ చాలా స్టైలిష్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో స్పోర్ట్స్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో బన్ని సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ – రాధాకృష్ణ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.
