40 కోట్ల వసూళ్ళకు చేరువలో ‘గోపాల గోపాల’.

gopala-gopala
సంక్రాంతి కానుకగా విడుదలైన విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల ‘గోపాల గోపాల’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఓపెనింగ్ వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 40 కోట్ల (షేర్) రూపాయల కలెక్షన్స్ త్వరలో చేరుకోనుంది. మరో పెద్ద సినిమా పోటి లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ‘గోపాల గోపాల’ సినిమాకు ఎదురు లేకుండా పోయింది. కుటుంబ కధా ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమాకు ఎక్కువగా ఉంది. పాత్రకు తగ్గట్టుగా వెంకటేష్ నటన, దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కిషోర్ పార్దసాని (డాలి) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీ సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించారు.

Exit mobile version