త్వరలో మంచు మనోజ్ పెళ్లి..!

Manchu-Manoj
మోహన్ బాబు ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. త్వరలో మంచు మనోజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొంత కాలంగా మంచు మనోజ్, బిట్స్ పిలాని స్టూడెంట్ ప్రణిత రెడ్డితో ప్రేమలో ఉన్నారని సమాచారం. మోహన్ బాబు కుటుంబంతో ప్రణిత రెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి అంగీకరించాయి.

త్వరలో ఎంగేజ్ మెంట్ జరుగుతుందని సమాచారం. నిశ్చితార్ధ వేడుక, తేదీ ఇతర వివరాలు త్వరలో తెలుస్తాయి. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లలో ఒకరు అయిన మనోజ్ పెళ్లి వార్త అభిమానులకు సంతోషం కలిగించింది.

Exit mobile version