బుల్లితెరపై ధురంధర్ సునామీ.. ఎప్పుడు, ఎందులో అంటే..?

Dhurandhar

2025 డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ తొలి భాగం భారీ విజయాన్ని అందుకుంది. రీసెంట్‌గా వచ్చిన సీక్వెల్ కూడా అంతకు మించి పెర్ఫార్మ్ చేయడంతో ఈ ఫ్రాంచైజీ కి ఉన్న క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది.

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ధురంధర్ టీమ్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ ఖరారైంది. ప్రముఖ ఛానల్ స్టార్ మా లో మే 31, 2026 మధ్యాహ్నం 2:30 గంటలకు ధురంధర్ తెలుగు వెర్షన్ ప్రసారం కానుంది.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్.మాధవన్ వంటి భారీ తారాగణం ఉంది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా, బుల్లితెరపై ఎలాంటి టీఆర్‌పీ రేటింగ్స్ సాధిస్తుందో చూడాలి.

Exit mobile version