ఫిబ్రవరి 6న అల్లరోడి ‘బందిపోటు’..!

bandipotu
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బందిపోటు’. నరేష్ సరసన ‘అంతక ముందు ఆ తర్వాత’ ఫేం ఈష జంటగా నటించింది. కళ్యాణ్ కోడూరి స్వరపరిచిన ఈ సినిమా ఆడియో ఇటివలే విడుదలైంది. నిర్మాణంతర కార్యక్రమాలను త్వరలో పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి 6వ తేదిన సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.

అల్లరి నరేష్ ‘బందిపోటు’లో ఘరానా దొంగగా కనిపించనున్నారు. బర్నింగ్ స్టార్ సంపుర్ణేష్ బాబు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలలో నటించారు. ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఐటెం సాంగుతో పాటు మరికొన్ని సన్నివేశాలలో శ్రద్ధా కనిపించనుంది. ఇ.వి.వి. సినిమా పతాకంపై నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మించారు. బయట దర్శకుడితో ఇ.వి.వి.సినిమా బ్యానర్లో ఓ సినిమా నిర్మించడం ఇదే మొదటిసారి.

Exit mobile version