
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘ఐ’ సినిమాను ఫిబ్రవరి నెలలో చైనా దేశంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు వేల స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. చైనాలో ఇప్పటి వరకు ఎవరూ షూట్ చేయని లొకేషన్లలో ‘ఐ’ సినిమాను చిత్రీకరించారు. సినిమాలో ప్రేమకథ అంతా చైనాలోనే నడించింది. పూలనే పాటతో పాటు అక్కడ ఒక ఫైట్ ను కూడా తెరకెక్కించారు.
జనవరి 14న తెలుగు, తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినా, వసూళ్ళ పరంగా రికార్డులు సృష్టిస్తుంది. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల పైచిలుకు వసూళ్లు సాదిచిందని నిర్మాతలు తెలిపారు.