2000 ఎపిసోడ్ లు పూర్తి చేసిన ‘స్టార్ మహిళ’

star-mahila1
‘స్టార్ మహిళ’ ! తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితమైన కార్యక్రమం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు ఈటీవి లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం నేటితో 2000 ఎపిసోడ్ ల మైలురాయి ని అందుకుంది. టెలివిజన్ చరిత్రలో 2000 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న ఏకైక మహిళా గేమ్ షో ‘స్టార్ మహిళ’ కావడం ఒక రికార్డ్. ఐదు ఇంట్రెస్టింగ్ రౌండ్స్ తో, ఆరుగురు కలర్’పుల్ పార్టిసిపెంట్స్ తో యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఈ షో గత ఆరు సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రసారమవుతూ ప్రేక్షకులకు స్వచ్చమైన వినోదాన్ని అందిస్తుంది. పేరు కు మహిళా గేమ్ షో అయినప్పటికి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ నెం.1 మహిళా గేమ్ షో గా ముందుకు దూసుకుపోతుంది.

Exit mobile version