‘జగడం’, ‘రెడీ’ సినిమాల తర్వాత మరోసారి యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమాకు యువ సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్నారు. వరుసగా రామ్ నటించబోయే రెండు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం ‘పండగ చేస్కో’ సినిమాలో రామ్ నటిస్తున్నారు.
‘పండగ చేస్కో’ తర్వాత శ్రీనివాస్ రెడ్డి (సురేందర్ రెడ్డి అసిస్టెంట్) దర్శకత్వంలో ఓ సినిమా.. మాటల రచయిత, ‘సెకండ్ హ్యాండ్’ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈ రెండు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు.రామ్, దేవిలది హిట్ కాంబినేషన్. ‘జగడం’, ‘రెడీ’ సినిమాలలో సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. తాజాగా వీరి కాంబినేషన్ మరోసారి తెరపైకి రావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈసారి దేవి ఎటువంటి ఆడియో అందిస్తాడో..!
