
రామ్ గోపాల్ వర్మ – ఈ పేరు విలక్షణం, విభిన్నం అనే దానికి మారుపేరు అని కొందరు అంటే కొందరు మాత్రం వివాధాలకు మారుపేరు వివాదంకి కేంద్ర బిందువు అంటారు. ఈ రెండింటిలోనూ తప్పు లేదు ఎందుకంటే వర్మ రెండింటిలోనూ దిట్టే అని చెప్పాలి. తన ప్రతి సినిమాలోనూ తెలుగు వారికి ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తూ, వారిని తమ స్టైల్లో మరింత గ్లామరస్ గా చూపిస్తూ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న వర్మ తన తదుపరి సినిమాలో ఓ బాలీవుడ్ హాట్ భామని తెలుగు వారికి పరిచయం చేయనున్నాడు.
2013లో సూపర్ హిట్ హిందీ ఫిల్మ్ ‘గ్రాండ్ మస్తీ’ సినిమాతో హిందీలో హాట్ భామగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కైనాత్ అరోరా. ఈ హాట్ భామని వరం అతనా తదుపరి సినిమా కోసం హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. సచిన్ జోషి హీరోగా నాస్తిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ శివార్లలో జరుగుతోంది. 1987లో విడుదలైన హాలీవుడ్ సినిమా ‘ఫాటల్ అట్రాక్షన్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ కు ఇది రీమేక్ అని సమాచారం. మరి బాలీవుడ్ హాట్ భామ అయిన కైనాత్ అరోరాని వర్మ ఎలా చూపిస్తాడో చూడాలి. ఇందులో మరో హీరోయిన్ గా మీర చోప్రా కనిపించనుంది.