
‘ఓనమాలు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన క్రాంతి మాధవ్ కి విమర్శకుల నుంచి మంచి ప్రశంశలు దక్కాయి. క్రాంతి మాధవ్ మరోసారి సున్నితమైన బావోద్వేగాలతో చేసిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. ‘రన్ రాజా రన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, సెన్సార్ నుండి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది.
క్రాంతి మాధవ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కూడా సున్నితమైన బావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రేమ, లక్ష్యం, మానవతా విలువలు గురించి చూపించాను. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రెండు మతాల మధ్య జరిగే ఓ బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఇది. వారి నటనతో ఎంతో ఎమోషనల్ గా సినిమా ఉండేలా చేసిన నటీనటులందరికీ థాంక్స్ అని’ అన్నాడు. ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎ వల్లభ నిర్మిస్తున్నాడు.