విదేశాలకు వెళ్లనున్న మహేష్ ‘శ్రీమంతుడు’..!

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఫిబ్రవరి 6న పొల్లాచ్చిలో మొదలయ్యింది. నెల రోజుల పాటు ప్రధాన తారాగణంపై అక్కడ అందమైన ప్రదేశాలలో పల్లెటూరి నేపధ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయిన తర్వాత మార్చి నెలలో సాంగ్స్ షూటింగ్ కొరకు యూనిట్ సభ్యులు ఫ్రాన్స్ వెళ్లనున్నారు. 12 రోజుల పాటు ఫ్రాన్స్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది.

రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పూర్ణ ప్రత్యేక గీతంలో నటిస్తుంది. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, సివి మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version