
ప్రముఖ దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా రేను భాగాలుగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ పార్ట్ 1లో అనుష్క కనిపించదంటూ మీడియాలో గత కొన్ని రోజుల నుండి ప్రచారం జరుగుతుంది. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానాలు ‘బాహుబలి’ పార్ట్ 1 మరియు పార్ట్ 2లలో కనిపిస్తారని యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం.
ఏప్రిల్ 17న విడుదల కానున్న ఈ సినిమాకు త్వరలో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. పబ్లిసిటీ స్టార్ చేసిన తర్వాత అన్ని విషయాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ‘బాహుబలి’ మేకింగ్ వీడియో లీక్ కావడంతో నిర్మాతలు సినిమాకు సంబందించిన ఏ ఒక్క విషయాన్నీ బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాపై మీడియాలో రోజుకొక వార్త బయటకోస్తున్నా స్పందించడం లేదు.