బాలీవుడ్ వెళ్తున్న వర్మ – సచిన్ ల ‘ఎఫైర్ ‘

rgv-sachin
రామ్ గోపాల్ వర్మ – ఈ పేరు విలక్షణం, విభిన్నం అనే దానికి మారుపేరు అని కొందరు అంటే కొందరు మాత్రం వివాధాలకు మారుపేరు వివాదంకి కేంద్ర బిందువు అంటారు. ఈ రెండింటిలోనూ తప్పు లేదు ఎందుకంటే వర్మ రెండింటిలోనూ దిట్టే అని చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ ఇమేజ్ ని పక్కన పెడితే గత కొంత కాలంగా బాక్స్ ఆఫీసు వద్ద విజయాలు మాత్రం లేవు. ఐస్ క్రీమ్ 1, అండ్ 2 సినిమాల తర్వాత వర్మ చేస్తున్న మరో రొమాంటిక్ హర్రర్ సినిమా ‘ఎఫైర్’.

సచిన్ జోషి హీరోగా నటిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ శివార్లలో జరుగుతోంది. ఒకేసారి ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని హిందీలో ‘మెంటల్’గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. 1987లో విడుదలైన హాలీవుడ్ సినిమా ‘ఫాటల్ అట్రాక్షన్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ కు ఇది రీమేక్ అని సమాచారం. మరి బాలీవుడ్ హాట్ భామ కైనాత్ అరోరా, మీర చోప్రాలు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Exit mobile version