
‘బొంబాయి’ సినిమాతో తమిళ తెరపై మరిసింది నేపాలీ ముద్దుగుమ్మ మనీషా కొయిరాల. ఇటీవల కాన్సర్ ను జయించిన మనీషా, తిరిగి సినిమాలలో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఆమె ఆసక్తిని గమనించిన పలువురు దర్శక, నిర్మాతలు కొత్త కథలతో ఆమెను సంప్రదిస్తున్నారు. తమిళ దర్శకుడు ఏ.యమ్.ఆర్. రమేష్ తాజా సినిమాలో మనీషా కొయిరాల ప్రధాన పాత్ర పోషించనుందని సమాచారం.
అర్జున్, శ్యామ్ హీరోలుగా ఏ.యమ్.ఆర్. రమేష్ దర్శకత్వంలో తెరకేక్కబోయే ద్విభాషా(కన్నడ, తమిళ) సినిమాలో ప్రాముఖ్యత గల పాత్ర కోసం దర్శకుడు మనీషాను సంప్రదించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. శ్యామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనువిందు చేయనున్నారు.