పాకిస్తాన్ పై ఇండియా ఘన విజయం

india
2015 క్రికెట్ వరల్డ్ కప్ నిన్ననే మొదలైంది.. ఇండియా – పాకిస్తాన్ లతో పాటు ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఈ రోజు జరిగింది. ఇప్పటి వరకూ ప్రపంచ కప్ లో ఇండియా – పాకిస్తాన్ 5 సార్లు తలపడ్డారు కానీ ఐదు సార్లు టీం ఇండియానే గెలిచింది. ఈ రికార్డ్ ని ఇండియా కంటిన్యూ చేస్తుందా లేక పాకిస్తాన్ బ్రేక్ చేస్తుందా అని అందరూ హో ఉత్కంఠతో ఎదురు చూసారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే…

టాస్ గెలిచినా ధోని తన జట్టుని మొదటగా బ్యాటింగ్ కి దింపాడు.. బ్యాటింగ్ కి వచ్చిన టీం ఇండియా ప్లేయర్స్ ని మొదట్లో పాకిస్తాన్ బౌలర్స్ కట్టడి చేసినప్పటికీ 20 ఓవర్ల తర్వాత ఇండియా బ్యాట్స్ మెన్స్ అమ జోరు చూపించి స్కోర్ బోర్డు ని ముందకు నడిపించారు. ముందుగా శిఖర్ ధావన్ – విరాట్ కోహ్లీ మంది పార్టనర్ షిప్ ని అందించగా, ఆ తర్వాత కోహ్లీ – రైనాలు మంచి పార్టనర్ షిప్ ని అందించారు. మొత్తంగా ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. టీం ఇండియాలో కోహ్లీ 107 పరుగులు చేయగా, రైనా 74, ధావన్ 73 పరుగులు చేసారు.

ఆ తర్వాత 301 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి వచ్చిన పాకిస్తాన్ మొదటి నుంచి భారీ ప్రెజర్ లో మ్యాచ్ ఆడింది. అంతే కాకుండా ఇండియా బౌలర్స్ తాకిడిని అడ్డుకోవడంలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. మొదట్లో కాస్త పరవాలేధనిపించినా మిడిల్ ఆర్డర్స్ బ్యాట్స్ మెన్స్ అందరూ ఒక్కసారిగా పెవిలియన్ దారి పట్టడంతో పాకిస్తాన్ ఓటమి పాలవ్వక తప్పలేదు. పాకిస్తాన్ టీం 47 ఓవర్లో 224 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దాంతో 76 పరుగుల తేడాతో గెలిచి, 2015 వరల్డ్ కప్ లో టీం ఇండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్ లో మిస్బాఉల్ హుక్ మాత్రం 76 పరుగులు చేసాడు.

ఎప్పటిలానే టీం ఇండియా వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై మరో విజయాన్ని నమోదు చేసి కంటిన్యూ వరల్డ్ కప్ ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ లలో 6-0 గా రికార్డ్ సృష్టించింది.

Exit mobile version