సరికొత్తగా కమల్ ‘ఉత్తమ విలన్’ ఆడియో

theyam-and-uthama-villain
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘ఉత్తమ విలన్’. కమల్ హాసన్ ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఫైనల్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మరియు ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో లాంచ్ ని మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే తెలియజేశాం. ప్లాన్ చేసారు కానీ కచ్చితమైన రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చెయ్యలేదు.

ఈ ఆడియో లాంచ్ ని ఒక ఆడియో వేదికగా కాకుండా ఓ సత్కార సభగా మార్చేయాలని కమల్ అనుకుంటున్నాడు. ఈ ఆడియో వేదికపై తమిళ్ మరియు సౌత్ లో ఫేమస్ ఆన్ స్క్రీన్ విలన్స్ గా చేసిన వారిని సత్కరించాలని అనుకుంటున్నాడు. అందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమల్ హాసన్, అతని టీం ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఇందులో కమల్ హాసన్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అవే మలయాళంలో ఫేమస్ అయిన తెయ్యమ్‌ కళాకారుడిగా, మరొకటి సినిమా నటుడిగా కమల్‌హాసన్‌ కనిపిస్తాడు.

రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్, పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ – రాజ్ కమల్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమా త్వరలో విడుదల కానుంది.

Exit mobile version