
‘అంజాన్'(తెలుగులో సికిందర్) తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య, సమంత మరోసారి జంటగా నటిస్తున్న సినిమా ’24’. ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. ఏప్రిల్ నెలలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభమవుతుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథ ప్రకారం మేజర్ పార్ట్ ముంబైలో గల ఓ స్టూడియోలో షూటింగ్ జరుపుతారని సమాచారం.
2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘మనం’ సినిమాకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి ఈ సినిమాకు సైతం వర్క్ చేస్తున్నారు.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘మాస్’ చిత్రీకరణలో సూర్య బిజీగా ఉన్నారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్. ‘మాస్’ పూర్తయిన తర్వాత ’24’ షూటింగ్ మొదలుపెడతారు.